గోమారంలో దొంగల బీభత్సం.. పట్టపగలే ఇంట్లో చోరీ

గోమారంలో దొంగల బీభత్సం.. పట్టపగలే ఇంట్లో చోరీ

శివంపేట :  మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన రాజగౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇంట్లోని అల్మారాలో ఉన్న రూ.10 వేల నగదును అపహరించారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తాళం పగిలి ఉండటాన్ని గమనించి లోపల పరిశీలించగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే చోరీ జరగడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో దొంగతనాల నివారణకు పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ