ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం.

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు.

బోధన్,(నిజామాబాద్) : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత 21 ఏళ్లుగా ఎమ్మెల్యే జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నరేందర్ రెడ్డి తో పాటు పలువురు యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్చందంగా రక్త దానం చేసి మానవత్వం చాటుకున్నారు. సమాజంలో ప్రతిఒక్కరు రక్త దానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో అవసరమైన వారికి ప్రాణదానం చేసినట్లేనని నాయకులు పేర్కొంటూ యువత పెద్దఎత్తున రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, బోధన్ పట్టణ అధ్యక్షులు దాము, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పాషా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి