మామిడిగూడలో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజలకు మెరుగైన పాలనా సేవలు, సౌకర్యాలు అందించేందుకే ప్రభుత్వం ఇలాంటి శాశ్వత భవనాలను నిర్మిస్తోందని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనం అందుబాటులోకి రావడం ద్వారా గ్రామ అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మామిడిగూడ సర్పంచ్ మాడావి రాంబాయి, ఉప సర్పంచ్ చరణ్, మాజీ జెడ్పీటీసీ మాడావి రాజు, పటేల్ మార్సుకుల గోవింద్ రావ్, జంగు, హన్మంతు, సారంగ్ రావ్, వార్డు సభ్యులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ