ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ బదిలీ వేటు తో రిమ్స్ గాడిన పడేనా..!*

** రిమ్స్ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు - నూతన డైరెక్టర్ గా బలిరాం చిట్కే 24 గంటలు రిమ్స్ ఆసుపత్రి కి వైద్యం కోసం వచ్చిన రోగులకు అందుబాటులో ఉంటారన్న పేరు సంపాదించుకున్న డైరెక్టర్ జైసింగ్ రాథోడ్

ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ బదిలీ వేటు తో రిమ్స్ గాడిన పడేనా..!*

ఆదిలాబాద్ బ్యూరో  : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఆదిలాబాద్ రిమ్స్, గత కొంతకాలంగా వరుస వివాదాలు, విషాద ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు ఈ పరిణామాలపై స్పందించిన ప్రభుత్వం, రిమ్స్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దీనితో పాటు రిమ్స్ డైరెక్టర్ గా సుదీర్ఘ సేవలందించిన డాక్టర్ రాథోడ్ జైసింగ్ ను బదిలీ చేస్తూ  శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రిమ్స్ తీరు మారి గాడిన పడుతుందేమో అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వివాదాల సుడిగుండంగా రిమ్స్.. డైరెక్టర్ పై బదిలీ వేటు..

రిమ్స్ లో ఏదో ఒక ఘటనతో మొదలైన వరుస వైఫల్యాలు రిమ్స్ ప్రతిష్టను మసకబారేలా చేశాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 21న రాత్రి ఎన్.ఐ.సి.యూ వార్డులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు నవజాత శిశువులు చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి, నివేదిక తెప్పించుకున్నా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కూడా అసుపత్రిలో పరిస్థితులు చక్కబడలేదు. గర్భిణీ, శిశువుల మరణాలు, వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం, ఏకంగా పట్టపగలే అసుపత్రి నుంచి వెంటిలేటర్లు చోరీకి గురికావడం వంటి ఘటనలు కలకలం రేపాయి.వీటికి తోడు సూపర్ స్పెషాలిటీ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేశారన్న ఆరోపణలు ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు కారణమయ్యాయి. ఇంత పెద్ద రిమ్స్ వ్యవస్థలో జరిగే ప్రతి ఘటనకు డైరెక్టర్ ఒక్కరినే బాధ్యుడిని చేయడం సబబు కాదనే వాదన కూడా వినిపించింది. ఇప్పటి వరకు రిమ్స్ కు రెగ్యులర్ డైరెక్టర్ తో పాటు పూర్తిస్థాయి రెగ్యులర్ సూపరింటెండెంట్ ను కూడా నియమించి, అధికార వికేంద్రీకరణ చేసింది.
*కొత్త సారథులు వీరే.. 

రిమ్స్ కొత్త డైరెక్టర్ గా జిల్లాకు సుపరిచితుడైన డాక్టర్ బలిరాం చిట్కీ నియమితులయ్యారు. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ సర్జరీ విభాగం ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేసింది. గతంలో ఆదిలాబాద్ జిల్లా ఆసుపత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ పనిచేసిన అనుభవం, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో సేవలందించిన నేపథ్యం ఆయనకు ఉంది. అలాగే, అనిసాబాద్ జిల్లా వైద్య కళాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ గా ఉన్న డాక్టర్ వెంకటి లకవాత్ ను రిమ్స్ రెగ్యులర్ సూపరింటెండెంట్ గా ప్రభుత్వం నియమించింది. వీరు నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇప్పటికైనా ఆసుపత్రి సేవలు గాడిన పడేనా..!
పేదలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన రిమ్స్ లో అత్యవసర సమయాల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండటం లేదనేది ప్రధాన ఆరోపణ. కొందరు వైద్యులు కేవలం మూడు గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తూ, ప్రయివేట్ ప్రాక్టీస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని, అసుపత్రి మొత్తం జూనియర్ వైద్యుల భరోసాతోనే నడుస్తుందనే విమర్శలు బలంగా ఉన్నాయి.
ప్రభుత్వం ఇద్దరు కొత్త అధికారులను నియమించి దిద్దుబాటు చర్యలు తీసుకుంది. మరి కొత్త డైరెక్టర్, సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో వైద్యుల తీరు మారుతుందా..! రోగులకు మెరుగైన వైద్యం అంది రిమ్స్ మళ్ళీ గాడిన పడుతుందా..! లేక పాత కథ పునరావృతమవుతుందా.. అనేది వేచి చూడాలి.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ