చండూరులో సర్వాంగ సుందర అయ్యప్ప ఆలయం:

నవంబర్ 14 నుండి 18 వరకు విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు

చండూరులో సర్వాంగ సుందర అయ్యప్ప ఆలయం:

హాజరు కానున్న మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు:

చండూరు,(నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యంత వైభవంగా,శబరిమల తరహాలో చండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్ లో ఆలయ కమిటీ,చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా నిర్మితమైంది.అయ్యప్ప స్వామి వారితో పాటు గణపతి,సుబ్రహ్మణ్య, నాగరాజ,మాలికాపురత్తమ్మ అమ్మవార్ల విగ్రహ,ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగాజరగనున్నాయి.ఈనెల14 నుండి 18 వరకు వేద పండితులమంత్రోచ్ఛారణలతో, అయ్యప్ప భక్తుల శరణు ఘోషల నడుమ ఆగమ శాస్త్రోక్తంగా త్రయాహ్నిక దీక్షతో,అత్యంత వైభవోపేతంగా జరుపనున్నట్లు ఆలయ కమిటీ,మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోటి శ్రీనివాసులు తెలిపారు.ఈ మహోత్సవాలకు ముఖ్య అతిధులుగా ముగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి,లక్ష్మి దంపతులు హాజరు కానున్నారు.పట్టణ,పరిసర ప్రాంత భక్తులు,అయ్యప్ప స్వామి దీక్షాధారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ కోరింది.5 రోజుల పాటు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టా క్రతువులు జరుగుతాయని పేర్కొన్నారు.14-11-2026 ఉ.8-15 ని॥లకు గణపతి పూజ,స్వస్తివాచనము,అఖండ దీపారాధన,దీక్షా ధారణ,మాతృకా,వాస్తు, యోగిని,నవగ్రహ మంటప ఆవాహనము,బ్రహ్మ కలశ స్థాపనము,పంచగవ్య ప్రాశనం,ప్రతిష్టా విగ్రహముల చండూరు పురవీధుల గుండా ఊరేగింపు,అగ్ని ప్రతిష్టాపనము,జలాధివాసము (ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు నీళ్ళు తేవలెను). మధ్యాహ్నం అన్నప్రసాద, మంటపపూజలు,హోమము,ప్రదోష పూజ, భజన కార్యక్రమముం ఉంటుందని చెప్పారు.15న యాగశాల ప్రవేశము,క్షీరాధివాసము, ధాన్యాధివాసము (ఉ.10 గంటలకు నుండి ప్రతి ఇంటి నుండి శేరు బియ్యం తీసుకురావలెను). మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ,సాయంత్రం 5 గంటలకు ఫలపుష్ప, శయ్యాధివాసములు.
16న ప్రధాన ప్రతిష్ట,ఉ.6-30 ని॥లకు మంటప
పూజలు,స్థపనము.శ్రవణా నక్షత్రయుక్త,శుభ ధనుర్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహ, పరివార దేవతలు,యంత్ర ప్రతిష్టాపనములు,నేత్రోన్మీలనము,బ్రహ్మకలశ ఉద్వాసన,పూర్ణాహుతి. పండిత సన్మానము,వేద ఆశీర్వచనమం.ఆలయ నిర్మాణం,దాతల వివరాలు, భక్తుల విరాళాలతో అద్భుత కట్టడం,దాతలకు ఘన సన్మానం కార్యక్రమం ఉంటుందని వారు చెప్పారు.
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ అయ్యప్ప స్వామి ఆలయం బ్లాక్ గ్రానైట్,బంగారు తాపడం తో శబరిమలను తలపించేలా నిర్మించారు.భారీ వ్యయంతో కూడిన ఈ దేవాలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు డబ్బులు అప్పుగా తెచ్చి నిర్మించినట్లు కమిటీ తెలిపింది.భక్తులు సహృదయంతో విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని దేవాలయ నిర్మాణ కమిటీ డాక్టర్ కోడి శ్రీనివాసులు కోరారు.
అదేవిధంగా విరాళాలు ఇచ్చిన దాతలకు,ఇచ్చే దాతలకు తేది 26-12-2026న జరిగే వార్షిక పడిపూజా కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరుగుతుందని కమిటీ ప్రకటించింది.మహా పడిపూజ,భక్తి గీతాలు ప్రవచనాలు ఉంటాయని కమిటీ తెలిపింది.అయ్యప్ప దీక్షతో ఆరోగ్య రక్ష,మేలు చేకూరుతుందని కమిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ చెప్పారు.
తేది18-11-2026 రోజు సాయంత్రం 6-30 ని॥లకు నూతనంగా ప్రతిష్టించిన "దేవాలయ పదునెట్టాంబడి" కి మహా పడి పూజా కార్యక్రమం జరుగుతుంది.అనంతరం భక్తులకు,అల్పాహారం.సమయానుకూలంగా ధార్మిక ప్రసంగాలు,ప్రవచనాలు ఉంటాయి.అనంతరం కేరళ తాంత్రిక ఆచార్య బ్రహ్మశ్రీ డా.కె. ప్రదీప్ కుమార్ తంత్రి చే మహాపడి పూజా నిర్వహణ, గోవిందు యాదగిరి గురుస్వామి చే భక్తి గీతాలు, బ్రహ్మశ్రీ ధేరం భాస్కరశర్మ (శతాధిక ప్రతిష్టాచార్య), పోతన ప్రకాష్ (దేవాలయ నమూనా ఆర్కిటెక్ట్), బ్రహ్మశ్రీ చిరువెల్లి హరికిషన్ శర్మ సిద్ధాంతి బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు.కార్తీక మాసంలో వేలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.ఈ దీక్ష ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
తెల్లవారుజామునే చల్లని నీటితో స్నానం వల్ల మెదడు వేడి తగ్గి,మనసుకు హాయి, ఏకాగ్రత పెరుగుతుంది.
సాత్విక,మితాహారం వల్ల శరీరం తేలికగా ఉండి,జీర్ణం సులభంగా జరిగి,రోగాలు దూరమవుతాయి.పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల రక్త ప్రసరణ,హృదయ స్పందనలు సమకూరుతాయి.
నేలపై నిద్రించడం వల్ల భూమి నుండి శక్తి మార్పిడి జరిగి, మనశ్శాంతి లభిస్తుంది.
చందనం నుదిటిపై గంధం పెట్టుకోవడం వల్ల నాడీ మండలంపై ఒత్తిడి కలిగి ఆరోగ్యం చేకూరుతుంది.
 చలికాలంలో నలుపు రంగు వేడిని గ్రహించి రక్షణ ఇస్తుంది,వనయాత్రలో వన్యమృగాల నుండి కాపాడుతుందని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ తెలియజేశారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి :  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు
చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!
సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!