సైబర్ నేరాలపట్ల ప్రజలు జాగృతులై ఉండాలి
నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలతో జాగ్రత్త ర్యాలీ ప్రజల అప్రమత్తతే ప్రమాదాలను దూరం చేస్తుంది ఫోన్ ప్లాష్ లైట్స్ తో ఫ్లాష్ వాక్ నిర్వహించిన అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్
నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఫోన్ ప్లాష్ లైట్స్ తో ఫ్లాష్ వాక్ కార్యక్రమం నిర్వహించిన అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ నిర్వహించడం జరిగింది.
ప్రతి పౌరుడు సెల్ ఫోన్ వినియోగిస్తున్న డిజిటల్ కాలంలో తెలిసి తెలియకుండా సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్ట పోతున్నాడని నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ అన్నారు.
సెల్ ఫోన్ లో డబ్బుల ఆశచూపి కొన్ని డబ్బులు మనకు ఆన్లైన్లో పంపించి మనతో ఎక్కువ డబ్బులు కాజేసే కేటుగాళ్లు సైబర్ నేరగాళ్ళని అన్నారు.డిజిటల్ అరెస్ట్ అంటు బెదిరించి డబ్బులు మాయం చేస్తారని డిజిటల్ అరెస్ట్ లే లేవని ఆయన తెలిపారు. ప్రజలు తమ డబ్బులు సెల్ ఫోన్ ద్వారా పంపించేటప్పుడు ఒకటికి పదిసార్లు వెరిపై చేసుకుని పంపించుకోవాలని కోరారు. ప్రజల కష్టార్జీతమైన డబ్బులు సైబర్ నేరగాళ్ళపరం కాకుండా ప్రజలే చైతన్యవంతులు కావాలని ఆయన ఆశిస్తు అందుకు పోలీసు శాఖ మద్దత్తు ఉంటుందని అన్నారు. సైబర్ నేరగాళ్ళ పరమైన డబ్బులు తిరిగి తెప్పించడం కష్టంతో కూడిన పని అని అయిన రికవరీ చాలా చేస్తున్నామని ఆయన తెలిపారు. ర్యాలీతో ఒక చైతన్యం, ఒక ఆలోచన, ప్రచారం ప్రజలలోకి వెళుతుందని బావించి ర్యాలీ నిర్వహించామని ఆయన తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కోర్టు నుండి ప్రారంభం అయిన ర్యాలీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది అనంతరం శుభం ప్రకాష్ పోలీసులు , పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ ర్యాలీలో నిజామాబాద్ ఎ.సి.పి ప్రకాష్ యాదవ్ , పోలీసు అధికారులు శ్రీధర్ రెడ్డి , ప్రసాద్ , సత్యనారాయణ , సందీప్, హరిబాబు , యాదగిరి గౌడ్ , సునీల్ కుమార్ , న్యాయవాదులు , స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


