బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా మఠం బిక్షపతి
చౌటకూర్ : పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి సదర్ సమ్మేళనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి బస్వాపూర్ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి యాదవ సోదరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సదర్ ఉత్సవాల్లో భాగంగా యాదవులు పోతురాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ ఆచారాలతో, ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు కొనసాగాయి.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ విష్ణు వర్ధన్, జోగిపేట యాదవ సంఘం నాయకుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


