జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ విద్యార్థిని అక్షిత ఎంపికe
చౌటకూర్ : క్రీడారంగంలో విశేష ప్రతిభ చాటుతూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని అక్షిత అరుదైన ఘనత సాధించింది. వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఆమె ఎంపికైంది.నిరంతర సాధన, పట్టుదలతో రాణిస్తూ రాష్ట్ర జట్టులో స్థానం దక్కించుకోవడంపై కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విశ్వనాథరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న అక్షితను ప్రిన్సిపల్, అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఘనంగా అభినందించారు. రాబోయే జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


