​ఇంటింటా పండ్ల తోట.. ఆరోగ్యానికి బాట!

​ఇంటింటా పండ్ల తోట.. ఆరోగ్యానికి బాట!

ఫాతిమానగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ముత్యంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి నాలుగు రకాల పండ్ల మొక్కలను గ్రామస్థులకు పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ దారం ఆదిరెడ్డి మాట్లాడుతూ, పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని, ఇవి మనుషులలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన పండ్లకు బదులుగా, మన ఇంటి ఆవరణలోనే పండ్ల మొక్కలను పెంచుకోవడం వల్ల పురుగుమందులు లేని తాజా, సేంద్రియ (ఆర్గానిక్) పండ్లను తినవచ్చని సూచించారు. అంతేకాకుండా, మొక్కలు పెంచడం వల్ల ఇంటి పరిసరాలు ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా మారడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ​ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి మర్రి మల్లేశం, గంగా, ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ శేఖర్, అంజిరెడ్డి, కారోబార్ రాజు, రాజేష్, హరినాథ్, వి.ఓ అధ్యక్షురాలు లావణ్య, రమణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.