ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు

ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు

నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విజయమేరీ ఉన్నత పాఠశాల ఆవరణలో బోధన్ మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు మండల విద్యాధికారి నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీఓ విజయకుమారి లతో కలిసి ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి జండా ఆవిష్కరణ చేసి క్రీడా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు మంచి విద్యతో పాటు క్రీడాల్లోను రాణించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు, షూస్ లు అందించడం జరిగిందన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు అందించి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు సరిపడా మూత్ర శాలలు నిర్మించామన్నారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పీఆర్టియు జిల్లా అధ్యక్షులు శంకర్, ట్రస్మా అధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.