రూ.30 వేల జరిమానా.. చెల్లించలేదని గిరిజనుడిపై ఫారెస్ట్ అధికారి దాడి

కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన

రూ.30 వేల జరిమానా.. చెల్లించలేదని గిరిజనుడిపై  ఫారెస్ట్ అధికారి దాడి

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా :  అటవీ శాఖ అధికారులు విధించిన రూ.30 వేల జరిమానా చెల్లించలేదనే కారణంతో ఓ గిరిజనుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బాగాల ముత్తయ్య అనే గిరిజనుడు (ఎస్టీ) తనపై డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ నాయక్ దాడి చేసినట్లు ఆరోపించారు. జోగాపూర్ నుంచి పంది మాంసం తెచ్చుకున్నావనే ఆరోపణతో ఎలాంటి ఆధారాలు చూపకుండా తనకు రూ.30 వేల జరిమానా విధించారని ముత్తయ్య తెలిపారు. తన వద్ద ప్రస్తుతం రూ.10 వేలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన రూ.20 వేలు మరుసటి రోజు చెల్లిస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఉదయం నుంచి ఫారెస్ట్ కార్యాలయానికి ఎందుకు రాలేదంటూ కార్యాలయంలోకి తీసుకెళ్లి బల్లపై పడుకోబెట్టి లాఠీతో కొట్టినట్లు ఆరోపించారు. డబ్బులు వెంటనే చెల్లించాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమలాంటి గిరిజనులు రూ.30 వేల జరిమానా ఎలా చెల్లించగలరని ముత్తయ్య ప్రశ్నించారు. తనను కొట్టవద్దని కాళ్లు మొక్కి వేడుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. తనకు రక్షణ కల్పించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఫారెస్ట్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ, తన చావుకు డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ నాయక్ కారణమవుతారని పేర్కొంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకుంటూ బతికే గిరిజన కుటుంబాలకు భారీ జరిమానాలు విధిస్తే వాటిని ఎలా భరించగలరనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.