నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని,
భారతీయ జనతా ఎస్.టీ. మోర్చా అధ్యక్షులు నేనవత్ ఓం సింగ్ ఆధ్వర్యంలో 'జన జాతీయ గౌరవ దినోత్సవం' కార్యక్రమాల నిర్వహణపై జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక కార్యశాల (వర్క్‌షాప్) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి హాజరయ్యారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ఆదివాసీ సంస్కృతి, చరిత్ర మరియు సంప్రదాయాలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలనే లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2021 సంవత్సరం నుంచి నవంబర్ 15వ తేదీని 'జన జాతీయ గౌరవ దినోత్సవం'గా ప్రకటించారు. ఈ యొక్క కార్యశాలలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర, పోరాటాలు, వారి త్యాగాలను ప్రజలకు వివరించాలని, అలాగే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంపై అందరికీ అవగాహన కల్పించేలా రాబోయే కార్యక్రమాల నిర్వహణపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. ఈ యొక్క కార్యక్రమంలో ST మోర్చ ప్రధాన కార్యదర్శి సుందర్ సింగ్ రాథోడ్, సర్పంచ్ అన్నం గోపి, బిజేవైయం జిల్లా కార్యదర్శి దేవా నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


