నాగర్‌కర్నూల్‌లో 30వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మెYour Title
సమ్మె శిబిరానికి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి సంఘీభావం - మంత్రితో ఫోన్‌లో చర్చలు
నాగర్‌కర్నూల్ : NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరింది. గురువారం సమ్మె శిబిరాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమ్మె శిబిరం నుంచే ఆరోగ్యశాఖ మంత్రి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌తో ఎంపీ మల్లు రవి ఫోన్‌లో చర్చలు జరిపారు.NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ఆర్థికశాఖ మంత్రితోనూ చర్చిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.సమ్మెతో ప్రజలకు వైద్యసేవల్లో జాప్యం జరుగుతోందని అధికారుల దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, గ్రాస్ శాలరీపై లిఖితపూర్వక హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని NHM JAC స్పష్టం చేసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ప్రజాప్రతినిధులకు NHM JAC నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


