కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.
నిజామాబాద్ : ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కోటగల్లికి చెందిన అల్లెపు మనోజ్ (48), కోలం రాజు (36) ద్విచక్ర వాహనం పై కంజర్ కు వ్యక్తిగత పని నిమిత్తం వచ్చారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గ్రామ శివారులో గడ్డి తీసుకొని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను వేగంగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని ఎస్ ఐ సుస్మిత పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతదేహాలను 108 అంబులెన్సు లో జీజీహెచ్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మనోజ్ మెడికల్ రిప్రజెంటివ్ గా, రాజు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మనోజ్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు, రాజుకు భార్య, నెల రోజుల బాబు ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ ఐ సుస్మిత తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


