బిజినపల్లిలో ఘనంగా మౌలానా ఆజాద్ 138వ జయంతి

బిజినపల్లిలో ఘనంగా మౌలానా ఆజాద్ 138వ జయంతి

బిజినపల్లి : భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి వేడుకలు బిజినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యువజన సంఘం, బిజినపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆజాద్ గారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటమే కాకుండా, ఆధునిక భారత విద్యావ్యవస్థకు పునాది వేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు, EX. DCC ఉపాధ్యక్షులు MD. ముక్తార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంగి విల్సన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ MD. నజీర్, దళిత నాయకులు మొల్గర మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల మైనారిటీ నాయకులు MD. అజీమ్, మైనారిటీ నాయకులు అమీర్ అహ్మద్, అజీముల్లా షరీఫ్, ఖుతుబొద్దీన్, ముఖీదుల్లా, సాదత్, తాహెర్, రహ్మతుల్లా, చీర్నం తిరుపతి, బీజేవైఎం అధ్యక్షుడు సంతోష్, బీసీ సంఘం అధ్యక్షుడు గంగనమోని శివ, మైనారిటీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 67

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.