కాప్రా మండల రెవెన్యూ కార్యాలయం సాక్షిగా అక్రమ బోర్లు:

ట్యాంకర్లకొద్ది నీళ్ల దందా, చోద్యం చూస్తున్న మండల జిహెచ్ఎంసి అధికారులు,

కాప్రా మండల రెవెన్యూ కార్యాలయం సాక్షిగా అక్రమ బోర్లు:

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : కాప్రా, చర్లపల్లి చెరువుల భూగర్భం, పరిసరాలలో అక్రమంగా బోర్లు వేసి లక్షల లీటర్లను తోడేస్తూ ప్రతినిత్యం వందల ట్యాంకర్లను కమర్షియల్ గా అమ్మేస్తూ నీళ్లదందా చేస్తున్నారు. 5,6, 7 ఆపైన హెచ్పి విద్యుత్ మోటార్లతో కేవలం 10 నిమిషాల వ్యవధిలో 5,500 లీటర్ల ట్యాంకర్ ల ను (సంపులో నీళ్లు తోడి నట్లు) నింపేస్తున్నారంటే నీళ్ల దోపిడి ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాప్రా తహసిల్ కు కూత వేటు దూరం, ఎల్లారెడ్డి గూడ ల నుంచి అక్రమ బోర్ల ద్వారా నీళ్లను ఫిల్లింగ్ చేసిన దాదాపు 100 పైనే ట్యాంకర్లు మండల రెవెన్యూ కార్యాలయం ఎదురునుంచి వెళుతూ కమర్షియల్ గా దందా చేస్తూ హోటళ్ళు, వాణిజ్య సముదాయాలలో పోస్తు సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అక్కడ మండల అధికారులు గానీ జిహెచ్ఎంసి అధికారులు గానీ చర్యలు తీసుకోకపోవడం వెనుక వీలకు ముడుపులు ముడుతున్నాయని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే అక్కడి అధికారులు చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. అక్రమ బోర్ల ద్వారా లక్షల లీటర్ల భూగర్భ నీళ్లను తోడేస్తున్న సంఘటనపై చర్య తీసుకోవాలని కాలనీ కమిటీల సమాఖ్య CCS విజ్ఞప్తి చేశారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.