పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎

పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎

‎​కోయిలకొండ : ‎ ‎క్రీడా రంగంలో మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలానికి చెందిన యువ క్రికెటర్ మరోసారి తన సత్తా చాటాడు. పాలమూరు ప్రీమియర్ లీగ్ అండర్-14 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఒక ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోయిలకొండ మండలం వాడీన్న చెరువు తండాకు చెందిన యువ క్రికెటర్ సాయి వరుణ్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.​మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి జట్లకు చెందిన బౌలర్లను ఎదుర్కొంటూ సాయి వరుణ్ ఆరంభం నుంచే అద్భుతమైన షాట్లతో చెలరేగిపోయాడు. మైదానంలో నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 77 బంతుల్లోనే 111 పరుగులు సాధించి అజేయంగా సూపర్ సెంచరీ నమోదు చేశాడు. తనదైన బ్యాటింగ్ శైలితో క్రీడాభిమానులను, నిర్వాహకులను ఎంతగానో అలరించాడు.యువ క్రికెటర్ సాయి వరుణ్ సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల క్రీడా వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బీఎస్‌ఆర్ అకాడమీ కోచ్ నవాజ్ నిర్వాహకులు శ్రీనివాసులు సాయి వరుణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే సాయి వరుణ్ చూపిన ప్రతిభ అభినందనీయమని, భవిష్యత్తులో మరింత కష్టపడి జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా గురువారం సామూహికంగా 25 ఇంకుడు గుంతల నిర్మాణానికి...
చరిత్రను వక్రీకరించినవాడే చరిత్రహీనుడు!- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా మఠం బిక్షపతి
సంస్కార్ విద్యాలయ లో యోగ సంస్థాన్ పిట్లం ఆధ్వర్యం లో యోగ సాధన
15న రైతు బహిరంగ సభను జయప్రదం చేయండి......సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ......
పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి
పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎