ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి

ఆదిలాబాద్ బ్యూరో : భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తొందరపాటుతో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి రీసర్వే పురోగతిని సమీక్షించారు. నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతగా ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి మండలంలో ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసి, లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రీసర్వే సమయంలో రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించాలని తెలిపారు. అసైన్డ్ భూముల పట్టాలు, భూముల విస్తీర్ణం, ప్రభుత్వ భూములు, గతంలో సేకరించిన భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. రాబోయే ఏడాదిన్నరలో మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రీసర్వేలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడే అధికారులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.