15న రైతు బహిరంగ సభను జయప్రదం చేయండి......సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ......
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రతినిధి : అఖిలభారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 15న ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.గురువారం పెద్దవూర మండల కేంద్రంలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పోరుగడ్డ నల్లగొండ నగరంలో 36వ ఏఐకెఎస్ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ మహాసభల సందర్భంగా 15న బహిరంగ సభ లక్ష మందితో నిర్వహించాలని విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.14 నుండి 16 వరకు పెదగడియారం సెంటర్లో వ్యవసాయ యంత్రాల ప్రదర్శన అగ్రి షో ఆటపాట కళాకారుల పోరాట కార్యక్రమాలు 16 నుండి 18 వరకు ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితమైన పోరాటాలు చేయడానికి ఈ మహాసభలలో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు రైతు రక్షణ కోసం నలగొండ వేదిక కానున్న నేపథ్యంలో రైతులు కార్మికులు యువకులు మహిళలు 15 జరిగే బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు దుబ్బ రామచంద్రయ్య,కెవిపిఎస్ జిల్లా నాయకులు చిరునాగర్జున,దోరపల్లి మల్లయ్య,తరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


