గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ జల్దా రాఘవులు 81వ జయంతి:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ జల్దా రాఘవులు 81వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ జల్దా రాఘవులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నాయకులు బండి శ్యామ్ గౌడ్, మేకల ఎల్లయ్య, డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, జలీల్ ఖాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


