మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

రాధికా రాణి శిష్య బృందం నృత్య ప్రదర్శనకు ప్రేక్షకుల ప్రశంసలు

మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

ఉప్పల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధికా రాణి శిష్య బృందం ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కన్విక, మీనాక్షి, తన్వి, భావన, ఊహిక, అమూల్య, కౌశిక, జాగృతి తదితరులు తమ నృత్య ప్రతిభను చాటుకున్నారు. గణేశా శరణం, పుష్పాంజలి, అలరిపు, వెంకటాచల నిలయం, అష్టలక్ష్మి స్తోత్రం, మంగళం వంటి వివిధ అంశాలను అద్భుతమైన హావభావాలు, లయబద్ధమైన అడుగులతో ప్రదర్శించారు. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయమైన భరతనాట్యంలోని అభినయం, నృత్యరీతులు, ఆధ్యాత్మిక భావాలను తమ ప్రదర్శన ద్వారా ఆవిష్కరించారు. చిన్నారుల ప్రతిభ, సమన్వయం, నృత్య నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రదర్శన ముగిసిన అనంతరం ప్రేక్షకులు చప్పట్లతో కళాకారులను అభినందించారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.