ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత.

బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానందా సరస్వతి స్వామి

ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత.

 

పెద్ద శంకరంపేట్ :

పెద్ద శంకరం పేట మండల కేంద్రానికి సమీపం లో ఉన్న ప్రముఖ  స్వయంభూ శైవ క్షేత్రం కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామి వారి ఆలయం లో శ్రీ సహజానంద సరస్వతి స్వామి వారి 16 వ వార్షిక ఆరాధన కార్యక్రమం లో ప్రత్యేక పూజ లో పాల్గొన్న బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానందా సరస్వతి స్వామి వారు భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక  ప్రసంగం చేశారు. భక్తులు తరచూ ఆలయాలు సందర్శిస్తూ ధార్మిక చింతన కలిగి ఉండాలని సర్వ ప్రాణుల పట్ల ప్రేమాభిమానములు కలిగి ఉండాలని హితబోధ చేశారు. ఈ ప్రత్యేక పూజ లో నాచారం పీఠాధిపతి శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామి వారు, బ్రాహీభూత శ్రీ సహజానంద సరస్వతి స్వామి వారి పూర్వాశ్రమ జ్యేష్ట కుమారుడు ప్రముఖ వేద పండితులు , చండీ ఉపాసకులు శ్రీ నరహరి శర్మ  దైవిక క్రతువు నిర్వహించారు.  రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్ర శేఖర్,రాఘవేంద్ర చారి.  సంతోష్ కుమార్,ప్రముఖ వేద పండితులు శిలాంకోట. ప్రవీణ్ శర్మ, గుడి. శ్రీనాథ్, శ్రీనందన్, బోగయ్యగారి. నాగరాజు శర్మ, ఆలయ పూజారి సంగప్ప , స్వామివారి శిష్యులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం
నాంపల్లి :  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో...
కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం