ఈనెల 15 న ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కు ఉచిత టెస్ట్.

ఈనెల 15 న ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కు ఉచిత టెస్ట్.

బాన్సువాడ :  బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గం లోని కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల కు ఈనెల 15 వ తేదీ ఆదివారం ఉదయం 9:30 నుండి 11:30 నిముషాలు వరకు కానిస్టేబుల్, ఎస్సై మోడల్ టెస్ట్ మద్నూర్ లోని జడ్.పి.హెచ్. ఎస్ బాయ్స్ పాఠశాల లో నిర్వహిస్తున్నట్లు ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ గురువారం తెలిపారు. ఈ సందర్భం గా అయ్యల సంతోష్ మాట్లాడుతూ. కానిస్టేబుల్ ఎస్సై పోస్టుల కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు మాదిరి టెస్ట్ నిర్వహిస్తున్నామ ని అందుకు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గం లో ఆసక్తి ఉన్న అభ్యర్థు లు ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే మోడల్ టెస్ట్ రాయడాని కి అవకాశం ఉంటుందని, ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందచేస్తామని అన్నారు. ఇలాంటి మోడల్ టెస్ట్ రాయడం వల్ల టైం ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామో తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 7386965601 ఫోన్ నెంబర్ కు సంప్రదించాల ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రోటే సాయిలు, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాటికొండ క్రాస్ రోడ్డు వద్ద కారులో అగ్నిప్రమాదం తాటికొండ క్రాస్ రోడ్డు వద్ద కారులో అగ్నిప్రమాదం
స్టేషన్ ఘన్‌పూర్,  : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో నిస్సాన్‌ టెర్రానో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు...
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
ఈనెల 15 న ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కు ఉచిత టెస్ట్.
మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు