గ్రామ పంచాయతీల్లో ప్రతి పనికి పైసలే...

గ్రామ పంచాయతీల్లో ప్రతి పనికి పైసలే...

నిజామాబాదు స్పెషల్ టీం : నిజామాబాదు జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో పని జరగాలంటే ప్రతి పనికి ఇంత ఇవ్వాల్సిందే అని రేటు ఫిక్స్ చేసిన కార్యదర్శుల వ్యవహారం చూస్తుంటే అడిగే వారు లేరనే ధోరణి తో
కార్యదర్శులు అక్రమ సంపాదనలతో  గ్రామాల్లో విర్రేగి  పోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.దీంతో జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడి కార్యదర్శులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.ఆయా గ్రామ పంచాయ తీల్లో ఇంటి నెంబర్లు, ఇంటి పర్మిష న్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్ర పనుల విషయంలో ప్రజల నుంచి లక్షల్లో " అమ్మమ్మయ్యా " రూపంలో లంచాలు తీసుకుంటూన్నారు.

విధి నిర్వాహాన లో జాప్యం 

ప్రతి గ్రామానికి కార్యదర్శులు ప్రతీ రోజు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయానికి 9 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామ పరిధిలో ప్రభుత్వం సూచించిన యాప్‌ ద్వారా హాజరు పడాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో పంచాయతీ పరిధిలో ఎన్ని నివాస గృహాలు ఉన్నాయి...? రోజు ఎన్ని గృహాలు నుంచి చెత్త సేక రిస్తున్నారు...ఈ యాప్‌లో నమోదు చేయాలి. డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక నర్సరీల వద్ద అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆయా గ్రామాల్లో పలువురు కార్యదర్శులు స్మార్ట్‌ఫోన్‌లలో ఫేక్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని హాజరును నమోదు చేస్తున్నారు.ఈ యాప్‌లకు నెలకు 300 నుంచి 500 రూపాయలు డబ్బులు చెల్లిం చి ప్లేస్టోర్‌లో ఫేక్‌ జీపీఎస్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇష్టారీతిన విధులు నిర్వ హిస్తున్నారు.ప్రభుత్వం నిర్దేశించిన అసలు డ్యూటీ లు నిర్వహించ కుండా గ్రామ పంచాయతికి పనుల కోసం వచ్చే ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన దాంట్లో కార్యదర్శి కి 20*/* సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యుల కోసం 80*/* ఇవ్వాల్సి ఉందని బహటoగా వాసులు చేయడం విశేషం.

లంచం లేనిదే పని కావటం లేదు.

ఇక నియోజక వర్గంలోని మేజర్‌ పంచాయతీల్లో పలుచోట్ల అక్రమాలు హద్దు మీరాయి.మేజర్ గ్రామ పంచాయతీలు, జాతీయ రహదారుల పక్కనే ఉన్న పంచాయతీల్లో స్థలాల క్రయ విక్రయాలు, లేఅవుట్లలో భారీగా పుచ్చుకుని పనులు చక్కబెడుతున్నారు. సామాన్యులు పని కావాలంటే పంచాయతీ కార్యదర్శుల చేయి తడపాల్సిందేనని, లేకుంటే కాలయాపన తప్పడం లేదని ప్రజల ఆరోపణలు ఉన్నాయి.ఇలా జిల్లాలోని పలు గ్రామాల్లో కార్యదర్శు లు ప్రతీ పనికి  డబ్బులు ఇవ్వాల్సిందే అని రేట్ ఫిక్స్ చేసి డబ్బులు ఇవ్వాల్సిందే నని డిమాండ్‌ చేస్తున్నా రనే విమర్శలు వినిపిస్తున్నాయి.సొంత ఆదా యమే లక్ష్యంగా కార్యదరషులు విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు జనన మరణ ధృవీకరణ పత్రాలతో పాటు,నాన్‌ అవ లేబులిటి సర్టిఫికేట్‌, ఇంటి నెంబర్లు, ఇంటి పర్మిషన్లు, ఇందిరమ్మ ఇండ్లు,వీటితో పాటు ఎంపీ పర్మిషన్‌, వాల్యుయేషన్‌ గ్రామాల్లో వ్యాపారస్తుల నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌లు, మ్యుటేషన్‌, లేఅవుట్‌ పర్మిషన్లు, ఇంటి నెంబర్లు వంటి అధికారాలు కార్యదర్శులకే ఉంటాయి. ఇతరత్ర పనుల విషయంలో ప్రజల నుంచి లంచాలు వసూళ్ళు చేస్తుంన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇది ఇలా ఉండగా ఆయా గ్రామాల్లో పలువురు ఇంటి నెంబరు ఇవ్వాలంటే ఆయా గ్రామాన్ని బట్టి భూమి విలువ ఎంత ఉందో దానికి అను గుణంగా నంబరు జారీ చేస్తే రూ.15000 నుంచి 60వేల వరకు అక్రమ వ సూళ్లకు పాల్పడుతు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. అలాగే జనన, మరణ ధృవీకరణ పత్రాల విషయంలో సైతం ఒక్కో సర్టిఫికేట్‌కు 5 వేల నుంచి 15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.. కార్యదర్శులకు ధృవీక రణ పత్రాల విషయంలో డబ్బులు ఇవ్వకపోతే కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిప్పించుకుం టున్నారు.మేజర్‌ గ్రామ పంచాయతీల్లో "లేఅవుట్‌ " పర్మిషన్ల కోసం 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల వరకు వసూలు చే స్తున్నారు.

నిధుల్లో సైతం అక్రమాలు...

గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులను పారదర్శకంగా వినియోగించాల్సి ఉంటుంది. గ్రామాల్లో పా రిశుధ్యం, వీధి దీపాలు, తాటునీటి సరఫరా, రోడ్లు, మురుగు కాల్వల నిర్వహణ, మరమ్మతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రూ. కోట్ల నిధులను విడుదల చేస్తుంది. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. లక్షల్లో నిధులు మంజూరు అవుతాయి. ఆయా గ్రామాల్లో కార్యదర్శు లు, చెత్త సేకరణ పారిశుధ్య నిర్వహణకు వాడుతున్న ట్రాక్టర్లకు ప్ర తీ నెల సుమారు రూ.10వేల వరకు డీజిల్‌ ఖర్చు వస్తే 15వేల నుం చి రూ.20వేల వరకు డీజిల్‌ పోయిస్తున్నట్లు బిల్లులు తీసుకుంటున్నా రు. ట్రాక్టర్లకు మరమ్మతులు, బోరు మోటార్లు, విద్యుత్‌ దీపాలు ఇత రత్ర ఖర్చులు ఎక్కువ బిల్లులు పొందుపరుస్తున్నారు.

అధికారులకు వాటాలా ?

గ్రామాల్లో కార్యదర్శులు వాసులు చేసె దాంట్లో / నిధులు అధికారులకు వాటాల రూపంలో ఇవ్వాల్సి ఉందని ఒక కార్యదర్శి (పేరు వ్రాయడం లేదు) బహటంగా ఒప్పే సుకున్నారు.గ్రామ పంచాయతీ లపై అజమాయిషీ చేసి తాధికారులైన ఎంపీవో, ఎంపీడీవో, డీఎల్‌పీవో, డీపీవోల పర్యవేక్షణ ఉండాలి.ప్రతి నెల పుడుపులు ఇవ్వడంతో ఆయా గ్రామాల్లో  పర్యవేక్షించడం లేదని తెలుస్తుంది.

ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు.

ఉదాహరణకు మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి గ్రా మ పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇల్లు బిల్లు విషయంలో లబ్ధిదా రుల నుంచి రూ.5వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాం డెడ్‌గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. అలాగే హాజీపూర్‌ మండ లం కర్ణమామిడి పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల నుంచి మొదటి బిల్లు నిధులు మంజూరు చేసేందుకు రూ.20వేల లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జన్నారం మం డలం లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంటి అనుమతి కో సం రూ.13వేలకు ఫోన్‌పే ద్వారా చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు ప ట్టుకున్నారు. బెల్లంపల్లి మండలంలోని బూదకుర్తు గ్రామంలో పంచా యతీ కార్యదర్శులు విదుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఏకంగా 16 మరణ ధృవీకరణ పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అధికారులు ఇప్పటికీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీ సులు అందించారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా గురువారం సామూహికంగా 25 ఇంకుడు గుంతల నిర్మాణానికి...
చరిత్రను వక్రీకరించినవాడే చరిత్రహీనుడు!- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా మఠం బిక్షపతి
సంస్కార్ విద్యాలయ లో యోగ సంస్థాన్ పిట్లం ఆధ్వర్యం లో యోగ సాధన
15న రైతు బహిరంగ సభను జయప్రదం చేయండి......సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ......
పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి
పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎