కల్లుగీత కార్మిక ఉద్యమనేత దేశిని చిన్న మల్లయ్య కు

9వ వర్ధంతి రోజు వారి స్వగ్రామం బొమ్మనపల్లి లో ఘనమైన నివాళి.

కల్లుగీత కార్మిక ఉద్యమనేత దేశిని చిన్న మల్లయ్య కు

హుస్నాబాద్ :  తెలంగాణ రాజకీయాల్లోనూ,కల్లుగీత కార్మిక ఉద్యమాల్లోనూ ఎంతో గుర్తింపు పొందిన మహోన్నత నాయకుడు, మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ దేశిని చిన్న మల్లయ్య పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అన్నారు.ఈరోజు వారి స్వగ్రామం కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లి లో 9 వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యకులు వి.వెంకటనర్సయ్య ,సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సురుగు రాజేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోహెడ కొమరయ్య గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్, మల్లయ్య కుమారులుదేశిని విప్లవ కుమార్, లక్ష్మణ్, చిగురుమామిడి మండల అధ్యక్షులు బండారుపల్లి చంద్రం గౌడ్ స్థానిక సొసైటీ అధ్యక్షులు ఇజ్జగిరిలతో కలిసి వారి విగ్రహానికి పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న మల్లయ్య కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, బొమ్మనపల్లి గ్రామంలో 1932లో జన్మించారని, చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కల్లుగీత వృత్తి చేస్తూ జీవనం సాగించాడన్నారు.ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్ గా పనిచేశాడు. 1953లో కమ్యూనిస్టు పార్టీలో చేరీ 1957 నుండి 78 వరకు సర్పంచిగా 21 సంవత్సరాలు,1978 నుండి 94 వరకు వరుసగా నాలుగు సార్లు ఇందుర్తి నుండి (హుస్నాబాద్) ఎమ్మెల్యేగా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడన్నారు. 1957 లో ఆవిర్భవించిన కల్లుగీత కార్మిక సంఘములో వారు ప్రధాన పాత్ర వహించారు.హర్రాజు మామ్లాలకు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కామ్రేడ్ ధర్మ బిక్షం గారితో కలిసి పని చేశారు. సొసైటీలు, ఎస్టీలు ఏర్పాటు,పెన్షన్, ఎక్స్ గ్రేషియా తదితర అనేక హక్కులు సాధించుకోవడంలో వారి కృషి ఎంతో ఉందన్నారు.అసెంబ్లీలో పేద ప్రజలు,గీత కార్మికుల తరఫున తన గళాన్ని విప్పాడన్నారు.నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు అంటేనే వారు ప్రజల మనిషి అని అర్థం చేసుకోవచ్చు అన్నారు. వారి స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడుతామన్నారు. సంఘం గత పది సంవత్సరాల నుండి ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాధిలో గీతన్నల చైతన్య యాత్ర నిర్వహిస్తుంది. దీనిలో వీరి యొక్క గొప్పతనాన్ని నేటి తరానికి అందిస్తుంది. ఈ సంవత్సరం బస్సు యాత్ర అత్యంత జయప్రదంగా జరిగింది. వేలాదిమంది గీత కార్మికులు అపూర్వ స్వాగతం పలికారు. సంఘం పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకు బండ్ పై పాపన్న విగ్రహం ప్రతిష్టించిందని,పెండింగ్ ఎక్స్ గ్రేషియా 20 కోట్ల రూపాయలు విడుదల చేశారు. పెన్షన్ కొరకు కొత్తగా 37,381 దరఖాస్తులు తీసుకున్నారన్నారు.నీరా తాటి ఈత ఉత్పత్తులు కొరకు బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ఇంకా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు పెన్షన్ 4వేలకు, ఎక్సిగ్రేషియా పది లక్షలకు పెంచాల్సి ఉందని,సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 150

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్ 15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఏఐఎస్ఎఫ్ చేపట్టిన ‘మన బడి – మన హక్కు’ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున గుండారెడ్డిపల్లి జిల్లా పరిషత్...
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.
అన్నపూర్ణ సేవా రథం ప్రచార పత్రాన్ని ప్రారంభించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్