సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ పొలం సైదులు ముదిరాజ్ కన్నుమూత

సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ పొలం సైదులు ముదిరాజ్ కన్నుమూత

వంగూర్(నాగర్ కర్నూల్) : నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ పొలం సైదులు ముదిరాజ్ (40) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున స్వగ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సైదులు చికిత్స పొందుతూ మృతి చెందారు. కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన సైదులు, సామాజిక సమస్యలపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డాక్టర్ సైదులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.