అర్ధరాత్రి రోడ్లపై విద్యార్థుల హాల్ చల్....

అర్ధరాత్రి రోడ్లపై విద్యార్థుల హాల్ చల్....

నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రతినిధి, : పెద్దవూర మండల కేంద్రంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురుకుల పాఠశాల విద్యార్థులు పాఠశాలల్లో భద్రతా పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థులు అర్ధరాత్రి వేళ పాఠశాల ప్రాంగణం దాటి పెద్దవూర పట్టణంలోని రోడ్లపైకి చేరుకుని పరస్పరం ఘర్షణకు దిగుతున్న ఘటన కలకలం రేపుతోంది.విద్యార్థులు రోడ్లపై వచ్చి కొట్టుకుంటున్న దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.అసలు అర్ధరాత్రి వేళ విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు ఎలా వచ్చారు?వారు పట్టణంలోని రోడ్లపైకి చేరుకునే వరకు పాఠశాల సిబ్బంది ఏం చేస్తున్నారు? రాత్రి వేళ విద్యార్థుల కదలికలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ కు లేదా? విద్యార్థుల భద్రత కోసం సెక్యూరిటీ సిబ్బంది, తగిన పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నాయా? ఉంటే సంఘటనలు ఎలా చోటు చేసుకుంటున్నాయి అనే ప్రశ్నలు తల్లిదండ్రులు,స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తనపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అయినా,విద్యార్థులు ఇలాంటి ఘర్షణలకు పాల్పడకుండా కౌన్సెలింగ్ నిర్వహించి వారి మానసిక పరిణతిలో స్నేహ సంబంధాలు,ప్రవర్తనపై మార్పు తీసుకురావాలని కోరుతున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పర్యవేక్షణ, సిబ్బంది విధుల్లో భాగంగా, రాత్రి వేళ భద్రతా ఏర్పాట్లు,విద్యార్థులు బయటకు వెళ్లకుండాఅధికారులు కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.