పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి

పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి

పరిశుభ్రతలో మోర్తాడ్  జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని జిపి సెక్రెటరీ సైఫుద్దీన్ పిలుపునిచ్చారు. గురువారం  మోర్తాడ్ పట్టణంలోని  డెంగు స్ప్రే చేయించినారు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, వ్యర్థాలను  తొలగింపజేశారు.
 
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రెటరీ మాట్లాడుతూ.. పట్టణ వాసులు రోడ్లపై చెత్తవేయొద్దనీ, ముఖ్యంగా వ్యాపారస్తులు తమ దుకాణాల నుంచి వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపాలిటీ వాహనాలకు అందించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే గ్రామపంచాయతీ చట్టం-2019 ప్రకారం జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడం కేవలం గ్రామపంచాయతీ  బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలు, వ్యాపారస్తులు గ్రామపంచాయతీకి  సహకరించి మోర్తాడ్ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా గురువారం సామూహికంగా 25 ఇంకుడు గుంతల నిర్మాణానికి...
చరిత్రను వక్రీకరించినవాడే చరిత్రహీనుడు!- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా మఠం బిక్షపతి
సంస్కార్ విద్యాలయ లో యోగ సంస్థాన్ పిట్లం ఆధ్వర్యం లో యోగ సాధన
15న రైతు బహిరంగ సభను జయప్రదం చేయండి......సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ......
పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి
పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎