15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్

15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్

హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఏఐఎస్ఎఫ్ చేపట్టిన ‘మన బడి – మన హక్కు’ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున గుండారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగంధర్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో ఉదయం అందిస్తున్న అల్పాహారం ప్రారంభంలో ఉన్న నాణ్యతతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో నూకలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నప్పటికీ, వంట సిబ్బంది ఆ బియ్యం నుంచి నూకలను వేరు చేసి విద్యార్థులకు మెరుగైన భోజనం అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఏఐఎస్ఎఫ్ నాయకులు పేర్కొంటూ వారిని అభినందించారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడగా, గత 15 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, దీంతో కుటుంబ పోషణకు, రోజువారీ ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై ఏఐఎస్ఎఫ్ కోహెడ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకునే హక్కు లేదా? పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను నిర్వహిస్తున్న కార్మికులకు 15 నెలలుగా వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కార్మికులు తమ శ్రమను అందిస్తుంటే వారి కుటుంబాల జీవనోపాధికి ప్రభుత్వం ఎందుకు భరోసా కల్పించడం లేదని ప్రశ్నించారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే కేవలం భవనాలు నిర్మించడం, ప్రచారాలు నిర్వహించడం సరిపోదని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాఠశాలల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.తక్షణమే పెండింగ్‌లో ఉన్న 15 నెలల వేతనాలను విడుదల చేయాలని, ఉదయం అల్పాహారం నాణ్యతను మెరుగుపరచాలని, మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.మరోవైపు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు సతీష్ చంద్రని ఏఐఎస్ఎఫ్ నాయకులు అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని, వాటి పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, విద్యార్థుల విద్యా హక్కుల కోసం, కార్మికుల న్యాయమైన వేతనాల కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని రాసూరి యుగేందర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కోహెడ మండల కార్యదర్శి కందుకూరి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.