సాంగ్వి (కే) గ్రామంలో నిమ్మల బాపురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, ఏ ఎం సి చైర్మన్ బోరంచు
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాంగ్వి (కే) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల బాపురెడ్డి ఇటీవల అనారోగ్యంతో పరమాపాదించారు . ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నరేష్ జాదవ్, ఏ ఎం సి చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,మాజీ డీసీసీ అధ్యక్షులు *సాజీద్ ఖాన్,
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ *అల్లూరి సంజీవ రెడ్డి,
*,గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు *తొడసం దౌలత్ రావు,
ఈరోజు వారి స్వగ్రామమైన సాంగ్వి (కే) గ్రామాన్ని సందర్శించి, నిమ్మల బాపురెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకులు నిమ్మల బాపురెడ్డి సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, ఏ ఎం సి చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ... నిమ్మల బాపురెడ్డి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి ఎంతోకాలంగా అంకితభావంతో పనిచేశారని, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, నాయకులు మరియు కార్యకర్తలతో ఆయనకున్న అనుబంధం చిరస్మరణీయమని అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


