బాల్కొండ నియోజక వర్గంలో సర్పంచుల అక్రమాలు - కార్యదర్శుల కహానీ..
> ప్రతి అనుమతికి రేట్ ఫిక్స్ > లబో దిభో అoటున్న ప్రజలు
నిజామాబాదు జిల్లా ప్రత్యేక క్లూస్ టీం : నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలోని గ్రామాల్లో శృతి మీరు తున్న సర్పంచుల అక్రమాలే కాకుండా వీరికి తోడుగా కార్యదర్శుల అక్రమ వసూల్లకు పాల్పడు తున్నారనే విషయాల పై మంగళ,బుధ,వరాల్లో ప్రత్యేక క్లూస్ టీం బృందం సర్వే లో వెల్లడి అయింది.పైగా ప్రతి పనికి రేట్ ఫిక్స్, వసూళ్లకు గ్రామ కార్యదర్శికి తోడుగ స్థానిక పాత్రికేయులు కావడం విశేషం.అక్రమ వసుల్లలో సగం "పార్టీ ఫండ్" కే అంటున్న సర్పంచ్ లు. బాల్కొండ లో పట్టా భూమి ఉన్న అధి కారికంగా నాలా కన్వర్షన్ ఫీజు కట్టిన కూడా నిర్మాణాలకు లక్షల్లో డిమాండ్ చేస్తుండటం విశేషo.నియోజక వర్గoలో అక్రమ వసుల్లా పై ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో,పైగా జిల్లా కలెక్టర్ ప్రజా వాణి లో ఫిర్యాదు చేసుకుంటావో చేసుకోoడని బహటంగా అంటున్న గ్రామ సర్పంచ్ లు అనడమే కాకుండా గ్రామానికి నేనే బాస్, నా మాటే వేదం నా మాటే శాసనం అంటూ "కలెక్టర్ ఎవరూ " అంటున్న సర్పంచ్ ల వ్యవహారం చూస్తుంటే ఎంత అహంకారమో తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా నియోజక వర్గం లోని ప్రజలు ఏకమై ఇప్పటి వరకు కేంద్ర, ఆయా గ్రామ పంచాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వివరాలు కావాలని కోరుతూ ఆర్. టి. ఐ చేట్టం పరిధిలో ప్రశ్నించాలని ప్రజల్ని ప్రొచ్చాహిస్తున్న మనవ హక్కుల సంఘాలు కోరడం విశేషం. బాల్కొండ నియోజక వర్గంలో సర్పంచుల అక్రమా లపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్ పల్లి, మెండోరా, వేల్పూర్, ఏర్గట్ల,భీమ్‌గల్, ముప్కాల్( 08 )మండలాలు ఉన్నాయి.బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలో (105) గ్రామ పంచాయి తీలు ఉండగా ఒక్క బాల్కొండ మండలంలోనే (21) గ్రామ పంచాయతీలు ఉన్నాయి.అలాగే నిజామాబాద్ జిల్లాలో మొత్తం(545)గ్రామ పంచాయతీలు ఉoడగా (33) మండలాలు(488)రెవెన్యూ గ్రామాలు(545) గ్రామ పంచా యతీలు (07)అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.ఇదీ ఇలా ఉండగా గ్రామ కార్యదర్శులు ప్రతి పనికి రేట్ ఫిక్స్, అక్రమ వసూల్లకు స్థానిక పాత్రి కేయులు తోడు కావడం విశేషం పై ప్రత్యేక రేపటి రోజు కథనం ప్రత్యేకo.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


