మల్హర్రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా రొడ్డ ఈశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక
మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు సిద్దు ఆధ్వర్యంలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ వివరాలు అధ్యక్షుడు రొడ్డ ఈశ్వర్, ఉపాధ్యక్షుడు ఇందారపు వంశీ,ప్రధాన కార్యదర్శి తాండ్ర అబ్రహం,కోశాధికారి రొడ్డ అన్వేష్, సహాయ కార్యదర్శి ఇందారపు సన్నీ,ప్రచార కార్యదర్శి ఇందారపు సాత్విక్,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగం పోచయ్యతో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు. మాదిగ విద్యార్థుల హక్కుల సాధనకు, విద్యార్థుల ఐక్యతకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


