ఎన్ ఎస్ కే కే, హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ సి క్యూ యు ఎస్ టి – 2026 పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాలానగర్ డివిజన్ పరిధిలోని ఫతేనగర్, ఫెరోజ్‌గూడలో ఉన్న ఎన్ ఎస్ కే కే, హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ సి క్యూ యు ఎస్ టి – 2026: కార్యక్రమానికి అతిథిగా బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణలు, శాస్త్రీయ నమూనాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకొని, భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందడి సుధాకర్ రెడ్డి కాతురాయ కవిత రంగంపేట శ్రీనివాస్ ముదిరాజ్ ప్రేమ్ కుమార్ శివాని తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


