ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి

ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి

* చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

* గ్రామీణ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

* నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

* డిచ్‌పల్లిలో ఘనంగా ఎస్‌జీఎఫ్ మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

 నిజామాబాద్ అక్టోబర్29:( విజన్ ఆంధ్ర)
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎస్‌జీఎఫ్ (SGF) మండలస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్న క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని చూసి నిరుత్సాహపడకుండా ప్రతి ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ, నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉన్నారని, వారిలోని సామర్థ్యాలను వెలికితీసి తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌తో పాటు వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించి, గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలని కోరారు.

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని, దాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ధర్పల్లి మండలంలో రూ.8 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

డిచ్‌పల్లికి రూ.2.5 కోట్లతో ఎస్టీ బాలుర వసతి గృహం

డిచ్‌పల్లి మండలానికి రూ.2.5 కోట్లతో ఎస్టీ బాలుర వసతి గృహం మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మానవతా సదన్‌లోని పిల్లల సంక్షేమం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూ.8.5 కోట్లతో వసతి గృహం మంజూరైందని వెల్లడించారు. ఈ వసతి గృహానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులతో పాటు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలకు మెరుగైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
 నియోజకవర్గంలోని పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటుకునేలా అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రశంసలు
క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యాలు, కోలాటాలు, మార్చ్‌ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అభినందించారు. వివిధ ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహించారు.
విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని, తమ ప్రతిభను చాటుకోవాలని, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సీతయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతాపూర్ గంగాధర్, తారాచంద్ నాయక్, పొలాసని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్, సుదర్శన్, AG దాస్, ధర్మాగౌడ్, నరేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, విద్యాశాఖ అధికారులు, క్రీడా నిర్వాహకులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌! మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌!
మెట్ పల్లి డివిజన్ : మెట్ పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం, కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపాలిటీ సాధారణ...
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్
ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.
ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి
జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి