బాన్సువాడ లో రెండు ఇళ్ల లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.
ఇద్దరు నిందితుల అరెస్ట్.
ఒక్కరు రిమాండ్... మరొకరు పరారీ....
29.7 తులాల వెండి, 9.8 గ్రాముల బంగారం స్వాధీనం...
బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లో రెండు ఇళ్లలో జరిగిన దొంగతనం కేసుల ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల ను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీ లో ఉన్నట్లు పట్టణ సీ.ఐ తుల శ్రీధర్ గురువారం వెల్లడించారు. బాన్సువాడ పట్టణం లోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సి.ఐ శ్రీధర్ మాట్లాడుతూ. బాన్సువాడ పట్టణం లోని శాంతినగర్ కాలనీ లో గత నెల అక్టోబర్ 26 తేదీన తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి 10 తులాల వెండి పట్ట గొలుసులు, 16 తులాల వెండి కడియాలు, 2000 నగదు దోచుకెళ్లారు. ఈనెల నవంబర్ 4 తేదీన హరిజనవాడ ప్రాంతాల్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరగగా 9.8 గ్రాముల బంగారం వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ చోరీ ఘటనల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు లో భాగంగా నిందితుల ను బుధవారం మధ్యాహ్నం బాన్సువాడ బస్టాండ్ ప్రాంతంలో గుర్తించి ఇద్దరిని అదుపులో కి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల్లో జాదవ్ రావ్, సందీప్ ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల ను విచారించగా, చోరీకి గురైన 29.7 తులాల వెండి, 9.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడి షాదాబ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సి.ఐ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్.ఐ శిరీష, హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుల్ పాండురంగ, సుదర్శన్ రావు, పృద్వి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


