ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి

మాజీ మంత్రి బోడ జనార్దన్ పిలుపు

ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి

బెల్లంపల్లి( మంచిర్యాల జిల్లా) : ఈ నెల 30న ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

సమావేశంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధం శెట్టి సాజన్‌, బెల్లంపల్లి ఇన్‌చార్జి బండారి శ్రీనివాస్‌గౌడ్‌, మంచిర్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శేషికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం
నాంపల్లి :  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో...
కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం