ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
సంఘనోనిపల్లిలో విద్యార్థులకు నోట్‌బుక్స్, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ , రవీందర్ రెడ్డి సేవలను కొనియాడిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
కోయిలకొండ :
కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించి, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రజానేత, దివంగత నాయకులు రెడ్డి గారి రవీందర్ రెడ్డి 5వ వర్ధంతి వేడుకలను మండలంలోని సంఘనోనిపల్లి గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ వేడుకలను పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు (భార్య అమూల్య రెడ్డి, కుమారుడు సమరసింహారెడ్డి) గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లు, గ్లాసులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు స్వీట్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా వెక్తులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి రవీందర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


