సాలూర గ్రామపంచాయతీ నాలుగు దుకాణాలకు బహిరంగ వేలంపాట
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని గ్రామపంచాయతీకి సంబంధించిన నాలుగు దుకాణాలకు శనివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా రూ.25 వేల చొప్పున డిపాజిట్ చెల్లించిన అనంతరం వేలంపాటలో పాల్గొన్నారు. గ్రామస్తుల సమక్షంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ పర్యవేక్షణలో వేలంపాట ప్రక్రియను నిర్వహించారు.ఈ వేలంపాటలో మొత్తం 11 మంది అభ్యర్థులు పాల్గొని దుకాణాల కోసం పోటీపడ్డారు. వేలంపాటలో అధిక ధరలు పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు నాలుగు దుకాణాలను దక్కించుకున్నారు. మొదటి దుకాణాన్ని మైదాపు నాగరాజు రూ.4,000కు, రెండో దుకాణాన్ని ముట్టెన్ ప్రకాష్ రూ.4,700కు, మూడో దుకాణాన్ని కన్నె రాజు రూ.4,900కు, నాలుగో దుకాణాన్ని ఎం. కృష్ణ రూ.4,800కు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు వేలంపాట ప్రక్రియలో పారదర్శకత పాటించే ఉద్దేశంతో గ్రామస్తుల సమక్షంలో బహిరంగ వేలంపాట నిర్వహించినట్లు తెలిపారు. వేలంలో దుకాణాలు దక్కించుకున్న వారితో రెండేళ్ల కాలపరిమితికి సంబంధించి అగ్రిమెంట్ పత్రాలు రాసుకొని దుకాణాలను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. వేలంపాట ప్రశాంతంగా ముగియడంతో గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, వేలంపాటలో పాల్గొన్న అభ్యర్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

