తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ పోషణ
ఐసీడీఎస్ సూపర్వైజర్ గిరిజ
దౌల్తాబాద్,సిద్దిపేట : హైమద్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ గిరిజ పాల్గొని గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన మొదటి గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలని, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ముర్రుపాలు శిశువుకు తొలి రోగనిరోధక శక్తిని అందిస్తాయని వివరించారు. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


