నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల కృషితో మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల కృషితో మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)

నిర్మాణానికి 101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు నిజామాబాద్ : మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసందర్భంగా నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ డిచ్‌పల్లి–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద నాలుగు వరుసల ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నవంబర్ 2, 2026న G.O.Rt.No.568 జారీ చేసింది. గతంలో రూ.93.12 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.101.80 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అదనపు నిధుల అనుమతులకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత రెండేళ్లుగా అదనపు నిధుల మంజూరు, సవరించిన అంచనాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర సలహాదారులు సుదర్శన్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ROB పనులపై చర్చించి నిర్మాణ పనులను వేగంతో ముందుకు తీసుకువెళ్లే విధంగా పూనుకుంటే మన చేతకాని ఎంపీ అరవింద్ తానే ఏదో చేసి నిధులు రప్పించానని చెప్పటం ఎలా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డే అన్నట్టుందని, తన వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని , తాను కేవలం మాటలు చెప్పడానికే తప్ప చేతలకు పనికిరాని నాయకుడని గుర్తుంచుకోవాలని సూచించారు

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం