టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మారేపల్లి శివలీలా చంద్ర గౌడ్
మండలం బిజినపల్లి
జిల్లా నాగర్ కర్నూల్ : ఈరోజు బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఊర గడ్డలో గల రాగణమోని లలిత - యాదయ్య ఇంటి వద్ద ఇందిరమ్మ ఇంటికి సర్పంచ్ మారేపల్లి శివలీలా చంద్ర గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా పాలన, ప్రజల పాలన, తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న పాలన గతంలో ఎప్పుడూ లేనటువంటి పాలన, పేదవాడి పాలన అని అన్నారు. మనకు రేవంతన్న అండగా ఉన్నారని, రాష్ట్రంలోని ప్రతి ఊరు, వాడ, తండా, గూడెం, గల్లీలకు ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇళ్లతో ప్రతి ఇంటా సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ గడ్డం రామచంద్రయ్య, వార్డు మెంబర్ తిమ్మక్క, సునీత, తిరుపతయ్య, షేర్ పల్లి శ్రీనివాస్ యాదవ్, సంతోష్ రెడ్డి, శ్రీశైలం, పంతుల మహేష్, గడ్డం శ్రీకాంత్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


