కొమ్ముకుంట తాండలో బీఆర్ఎస్‌ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి 100 మంది ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో చేరిక

రూ.2.60 కోట్ల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

కొమ్ముకుంట తాండలో బీఆర్ఎస్‌ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి 100 మంది  ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమక్షంలో చేరిక

తాడూరు(నాగర్ కర్నూల్) : మండలంలోని కొమ్ముకుంట తాండలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామంలోని రోడ్డు సమస్యను పట్టించుకోలేదని, అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని చేరికలైన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజల చిరకాల రోడ్డు సమస్య పరిష్కారానికి రూ.2 కోట్ల 60 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ రమేష్, మాజీ డిప్యూటీ సర్పంచ్ రాజు నాయక్, సోమలా నాయక్, లక్ష్మణ్ నాయక్, దీప్లా నాయక్, వార్డు సభ్యుడు మోతియా నాయక్, శంకర్ నాయక్, మంజు నాయక్, యువ నాయకులు సురేష్, భాను నాయక్, శివ రాథోడ్, శ్రీకాంత్, రాము, రాజేష్, వినోద్, మహేష్, తారాసింగ్, చందర్, జగదీష్, గ్రామ మహిళలు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News