మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న నూతన యూపీఎస్సీ అధికారులు
-స్వామివారి ఆశీస్సులు పొందిన వివిధ రాష్ట్రాలకు చెందిన నూతన నియామక అధికారులు
కొమురవెల్లి,(సిద్దిపేట) : వివిధ రాష్ట్రాలకు చెందిన నూతనంగా నియమితులైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అధికారులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.అనంతరం చేర్యాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన నకాషీ కళాచిత్రాలను సందర్శించారు. నకాషీ కళాకారుల ప్రతిభ, సంప్రదాయ కళారూపాల ప్రత్యేకతలను తెలుసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రతీకగా నిలిచే నకాషీ చిత్రాలను సందర్శించడం పట్ల అధికారులు ఆసక్తి కనబరిచారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా యువజన అధికారి ఎం. రంజిత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యక్రమ అధికారి జి. కిరణ్ కుమార్, మై భారత్ ప్రతినిధి దొమ్మాట రాజు, కొమురవెల్లి, చేర్యాల మండలాల మై భారత్ వాలంటీర్ కటకం అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ (మేరా యువ భారత్) కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన నిర్వహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


