నాలుగు సంవత్సరాల పోరాటానికి ఫలితం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,

నాలుగు సంవత్సరాల పోరాటానికి ఫలితం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  బుధవారం కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు పరిధిలోని రమ్యా గ్రౌండ్స్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కేటాయించిన 2.39 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇటీవల మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనో చౌదరి ఈ స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, స్థానిక నాయకులతో కలిసి స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, ఇది ఏ ఒక్కరి విజయమో కాదు.. ప్రజలందరి విజయం అని పేర్కొన్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి పునాదులు వేసి పనులు ప్రారంభించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డు స్థలాల పేరుతో ఈ భూమిని విక్రయించేందుకు బోర్డులు ఏర్పాటు చేసి వేలం వేసే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని విక్రయించకుండా కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేశామని, ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేశామని గుర్తుచేశారు. ఈ పోరాటంలో ప్రజలు, మీడియా మిత్రులు అందించిన సహకారం ఎంతో కీలకమని, అందరి సమిష్టి కృషి వల్లే నేడు ఈ స్థలం విద్యాశాఖకు బదిలీ అయిందని తెలిపారు. ముఖ్యంగా మీడియా మిత్రులు తమ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రజా ఉద్యమానికి మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.

ఎట్టకేలకు స్థలం విద్యాశాఖకు బదిలీ కావడంతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి మార్గం సుగమమైందని, త్వరలోనే పాఠశాల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కూకట్‌పల్లి, మూసాపేట ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్రయించకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఉపయోగపడే విలువైన భూములను విక్రయిస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని, వారి అవసరాలకు స్థలాలు లేకుండా పోయి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విజయం కోసం సహకరించిన కేపీహెచ్‌బీ ప్రజలకు, స్థానిక నాయకులకు, మీడియా మిత్రులకు, స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేసిన జిల్లా కలెక్టర్ మనో చౌదరి కి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, పగడాల బాబురావు  కృష్ణారెడ్డి, ప్రభాకర్, రాజేష్ రాయి, గోపి, శివారెడ్డి, ఉపేంద్ర రెడ్డి, వెంకట్ రెడ్డి, వలవల నాయుడు ,తిరుపతి శ్రీనివాస రెడ్డి, తులసిరెడ్డి, నర్సింగ్ రావు, రామకృష్ణ, సాంబశివ రావు సీనియర్ సిటిజెన్ అస్సోసియేషన్ వారు, లతా, పద్మ, బేగం, వర లక్ష్మి,   బీఆర్ఎస్  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు