అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
అచ్చంపేట(నాగర్ కర్నూల్) :
ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న విగ్రహ ఆవిష్కరణ వచ్చే నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం కరపత్రాన్ని విడుదల చేశారు. అచ్చంపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర గద్దర్ అన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతుల మీదుగా జరగనుంది. ఈ సందర్భంగా రామ్ రహీం ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ, కళాకారుడు, సామాజికవేత్త, దేశానికి వెలుగు నింపిన మహనీయుడు గద్దర్ అన్నను అనునిత్యం స్మరించుకోవాలన్నారు. అచ్చంపేటలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రామ్ రహీం ఆటో యూనియన్ డ్రైవర్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు.కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు అషూ, ఉపాధ్యక్షులు వెంకటేష్, యూనియన్ పెద్దలు శ్రీనివాసచారి, మల్లేష్, అఖిల్, నరేందర్, షబ్బీర్, అశోక్ మరియు విగ్రహ కమిటీ పెద్దలు జక్క గోపాల్, పాండు, మురళి మోహన్, నాగేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


