శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి

బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి , బీజేపీ పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్ పనుల పరిశీలన

శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి

నల్గొండ/మర్రిగూడ : మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని ఫ్లోరైడ్ రహిత సాగు,తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన శివన్నగూడెం రిజర్వాయర్ పనులను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు,స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఆయన శివన్నగూడెం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల రైతాంగానికి సాగునీరు అందించడానికి రాచకొండ గుట్టల్లో నూతనంగా రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ద్వారా ప్రతిపాదిత రాచకొండ రిజర్వాయర్‌కు నీటిని తరలించి, అక్కడ నుంచి గొలుసుకట్టు చెరువులను నింపేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు. తద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి, వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీరు అందుతుందని పేర్కొన్నారు.మరోవైపు డిండి ప్రాజెక్టుపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండటం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు.రైతులకు కావాల్సింది ప్రకటనలు, రాజకీయ విమర్శలు కాదని.. ప్రాజెక్టులు పూర్తయి పొలాలకు నీళ్లు రావడమేనని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు వెంటనే స్పందించి నిర్దిష్ట కాలమితిలో పనులు పూర్తి చేయాలని.. నారాయణపురం, చౌటుప్పల్ రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆపేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర,జిల్లా స్థాయి నాయకులు,మండల అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Views: 229

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్