జాతీయ క్రికెట్ జట్టుకు శివంపేట విద్యార్థిని చందనసాయి ఎంపిక
శివంపేట : మండలానికి చెందిన విద్యార్థిని చందనసాయి అండర్-17 జాతీయ స్థాయి బాలికల క్రికెట్ జట్టుకు ఎంపికై సత్తా చాటింది. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో చోటు సంపాదించింది. ఈ నెల 15 నుంచి జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో గ్రామస్తులు, స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ చందనసాయికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Nov 2026 20:46:44
కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
