వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు
*బిజినపల్లి : బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి పిట్టల జ్యోతి శంకర్, మండల ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ కురవి శ్రీకాంత్ శర్మ పాల్గొని గ్రామంలోని పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావడానికి కావలసిన అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు విధానం తదితర అంశాలను వివరించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అందరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


