బెల్లంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా జాడి మహేశ్వర్
బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా ): బెల్లంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నిక బుధవారం ఉత్కంఠగా జరిగింది. మండలంలోని 17 గ్రామపంచాయతీల సర్పంచులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జాడి మహేశ్వర్, గురజాల గ్రామ సర్పంచ్ వంగ రామన్న పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో జాడి మహేశ్వర్‌కు 9 ఓట్లు, వంగ రామన్నకు 8 ఓట్లు లభించడంతో జాడి మహేశ్వర్ ఒక ఓటు మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా జరుకుల సాయికిరణ్, జనరల్ సెక్రటరీలుగా సుధామల్ల వెంకటి, బొంతల అరుణ, కోశాధికారిగా జుమ్మిడి లలితను నియమించారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
