సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించాలి: డాక్టర్ ఎర్ర మాధవ కృష్ణారెడ్డి
అవినీతి నిర్మూలనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి సమాచార హక్కు వికాస సమితి మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నస్పూర్(మంచిర్యాల), : ప్రజల్లో సమాచార హక్కు చట్టం (RTI) పై విస్తృత అవగాహన పెంపొందించి, అవినీతి నిర్మూలనకు ప్రతి కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకులు డాక్టర్ ఎర్ర మాధవ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి ఏరియా, 100 ఫీట్ల రోడ్డులోని లయన్స్ భవన్లో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న వారికి సమాచార హక్కు చట్టంలోని 31 సెక్షన్లపై సమగ్ర అవగాహన కల్పించారు. సమాచార హక్కు దరఖాస్తును ఏ విధంగా రాయాలి, సమాచారం ఇవ్వని పక్షంలో అప్పీల్ ఎలా చేయాలి, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ఫిర్యాదు ఎలా చేయాలనే అంశాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. ఈ సదస్సుకు మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు హాజరయ్యారు. సదస్సు అనంతరం మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎర్ర మాధవ కృష్ణారెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బత్తుల సతీష్ కుమార్, లీగల్ సెల్ అధ్యక్షుడు అడ్వకేట్ సుంకరి భుజంగరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉప్పుల రామకిషన్, జిల్లా గౌరవ అధ్యక్షుడు చిందం మల్లేశ్ అనంతరం డాక్టర్ ఎర్ర మాధవ కృష్ణారెడ్డి, మహిళా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హేమలత చేతుల మీదుగా నూతనంగా నియమితులైన సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


